ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఈఓ ఎంకే మీనా మాట్లాడుతూ.. పోల్ వయొలెన్స్ జరగకూడదని జిల్లా ఎస్పీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చిందన్నారు. జీరో వయొలెన్స్, జీరో రీ-పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. 64 శాతం మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్ కామ్ పెట్టామని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్ల లోపల.. బయట వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని ఏపీ సీఈఓ చెప్పారు.
RCB vs DC: మమ్మల్ని ఓడించడం ఢిల్లీకి కష్టమే: బెంగళూరు కోచ్
మరోవైపు.. పోల్ డేటా మానిటరింగ్ సిస్టం-PDMS యాప్ ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని ఎంకే మీనా పేర్కొన్నారు. కొన్ని చోట్ల కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారనే సమాచారం వస్తోందని.. గతంలో ఎన్నడూ లేనంతగా పోలీస్ అబ్జర్వర్లు, జనరల్ అబ్జర్వర్లను ఈసీ నియమించిందని అన్నారు. ఓటర్లను ఎన్నికలకు రాకుండా చేసేలా ఎవరైనా వేళ్లపై ఇంకు గుర్తు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 20 శాతం మేర ఈవీఎంల బఫర్ స్టాక్ వచ్చిందని.. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించే మెకానిజం ఏర్పాటు చేసుకున్నామని ఏపీ సీఈఓ తెలిపారు.
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో స్వేచ్ఛ కోసం పోరాటం.. భారీగా నిరసనలు..
గతం కంటే ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ వినియోగం జరిగిందని ఎంకే మీనా చెప్పారు. ఈసారి 90 శాతం మేర పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగిందని.. దూర ప్రాంతాల నుంచి ఓటేసేందుకు వచ్చే వారికి ఇబ్బందులు రాకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని ఆర్టీసీ ఎండీతో మాట్లాడామని.. ఎన్నికల సిబ్బంది నిమిత్తం కొన్ని ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నామని తెలిపారు. మరోవైపు.. వృద్ధులకు, దివ్యాంగులకు పోలింగ్ స్టేషన్లల్లో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు.