AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో అత్యవసరంగా సమావేశం అయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది.. సుమారు గంటన్నర పాటు ముగ్గురు కీలక అధికారుల భేటీ అయ్యారు. మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సిన అంశంపై కూడా ముగ్గురు కీలక అధికారులు చర్చించుకున్నారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు ఇవ్వాలని భావిస్తున్నారు సీఎస్, డీజీపీ. మాచర్ల మొత్తం 144 సెక్షన్ అమలు చేశామన్నారు సీఈసీకి వివరించనున్నారు. హింసాత్మక ఘర్షణ విషయంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టాం.. ఎంత మందిని అదుపులోకి తీసుకున్నామనే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం తెలపనున్నారు.
Read Also: RCB: ఫ్యూచర్లో ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలంటే.. మాజీ క్రికెటర్ సలహా..!
కాగా, ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై… సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. నిన్న, ఇవాళ…. తిరుపతి, మాచర్ల, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో గొడవలు జరిగాయి. ఇప్పటికీ అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో షాపులు కూడా మూయించారు పోలీసులు. నర్సరావుపేటలోనూ పోలింగ్ రోజున…. టీడీపీ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైనా ప్రతిదాడికి దిగారు ప్రత్యర్థులు. ఏపీలో పోలింగ్ రోజున మొదలైన గొడవలు… హింసాత్మకంగా మారుతుండటంతో… కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. పోలింగ్ తర్వాత హింసను ఎందుకు అరికట్టలేకపోయాలో వివరించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ.