Lok Sabha Elections 2024: ఇంటి నుంచే ఓటేసిన మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశల పోలింగ్ పూర్తి కాగా.. మిగిలిన మూడు దశల ఓటింగ్‌కు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది. మే 25న ఢిల్లీలో ఆరో దశ పోలింగ్ జరగనుంది. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీలోని ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, శుక్రవారం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి తమ ఇంటి నుంచే ఓటు వేశారు.
READ MORE: Uttarakhand : ఇంటి బయట ఆడుకుంటుండగా పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
జిల్లా ఎన్నికల కార్యాలయ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి ఓటింగ్ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇంటికి కూడా ఎన్నికల అధికారులు చేరుకున్నారు. అతనూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కార్యాలయం (CEO) 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల (PWD) కోసం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సదుపాయం మే 24 వరకు కొనసాగుతుంది.
ఢిల్లీలో 5,472 మంది వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. వారు ఇంటి నుంచే ఓటేసేందుకు ఫారం 12Dని నింపారు. ఢిల్లీ ఎన్నికల సంఘం సీఈఓ కూడా ఇంటి వద్దే ఓటు వేయాలనుకునే ఓటర్ల కోసం సన్నాహాలు చేశారు. ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియలో ఓటింగ్ సమయంలో అత్యంత గోప్యత, సమగ్రతను కాపాడేందుకు పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది వారి వెంట ఉంటారు. శారీరక పరిమితులు లేదా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడి స్వరం లెక్కించబడే న్యాయమైన ప్రజాస్వామ్యాన్ని నిర్ధారిస్తామని ఎన్నికల సంఘం (ECI) హామీ ఇస్తుంది. ఇంటికి వెళ్లేముందు వారి చరవాణులకు షెడ్యూల్ మెసేజ్ రూపంలో పంపుతారు. మొత్తం ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి, ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేయబడుతుంది.
- Tags
- CEO
- Delhi
- EC
- from home
- Hamid Ansari
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!