సోమవారం ఎన్నికల సంఘాన్ని పశ్చిమ బెంగాలు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా.. టీఎంసీ నేత పీయూష్ పాండాపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్ను బీజేపీ కోరింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలో తన కులాన్ని ఉద్దేశించి పాండా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో.. రోజు ఢిల్లీలో ఈసీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.…
లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ రిలీప్ ఇచ్చింది. రూ.3500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. లోక్సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది.
Heatwave: వేసవి ఎండలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మాసం రాకముందే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసిన నేపథ్యంలో ఓటర్ల భద్రత కోసం లోక్సభ ఎన్నికల ముందు భారత ఎన్నికల సంఘం(ఈసీ) ఈరోజు కీలక సూచనలు జారీ చేసింది.
ఈసీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం సలహాదారు పదవి నుంచి సజ్జలను తొలగించాలని పేర్కొన్నారు. సజ్జల ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని తెలిపారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం…
ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా.. ఎన్డీఏ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు. కొందరు ఐపీఎస్ అధికారులు ఈ తరహా అధికార దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ…
విశాఖ డ్రగ్స్ రవాణా పంచాయతీ ఈసీకి చేరింది. విశాఖ డ్రగ్స్ రవాణాకు.. తమకు లింకులున్నాయన్న టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆధారాల్లేని ఆరోపణలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పురంధేశ్వరి సన్నిహితులకే డ్రగ్స్ రవాణతో సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది. సీబీఐ చెప్పిన…