ప్రస్తుతం భారతదేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నియమావళి నడుస్తోంది. ఇందులో భాగంగా అనేక ఆంక్షలు నడుమ రాజకీయ నాయకులు వారి ఎలక్షన్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు ఎన్నికల నియమాలను గుర్తుచేస్తున్న గాని మరోవైపు రాజకీయ నాయకులు ఒక్కోసారి వాటిని అతిక్రమించి ఎలక్షన్ కమిటీ చేత నోటీసులను ఇప్పించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు కూడా ఈసీ ఈ విషయంలో నోటీసులు జారీ చేసింది.
Also Read: UAE Rains: యూఏఈలో భారీ వర్షాలు.. ఒమన్‌లో 18 మంది మృతి!
ఇక తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఎలక్షన్ కమిటీ నోటీసులు జారీ చేసింది. న్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌కు నోటీసు ఇచ్చింది ఈసీ.
Also Read: UK couple: కోర్టు షాకింగ్ తీర్పు.. చిన్న తప్పిదంతో ఓ జంటకు ఏం జరిగిందంటే..!
ఏప్రిల్ 18లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏప్రిల్ 5 వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఈ నోటీసును జారీ చేసింది. దీనిపై ఏప్రిల్ 18 గురువారం ఉదయం 11 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.