మంచి ఎండకాలంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ వైపు భానుడు భగభగమండిపోతున్నాడు.. ఇంకోవైపు నేతల మాటలు కూడా హీట్ పెంచేస్తున్నాయి. అధికార-ప్రతిపక్ష నాయకులు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. కొందరు హాట్.. హాట్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయా పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీకి 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని పువ్వు పార్టీ నేతలు కోరారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ సంచలనం
ఆదివారం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి చేపట్టిన మహా ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. ఈ లోక్‌సభ ఎన్నికలు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగాయని వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషుల్ని పెట్టుకుందని ఆరోపించారు. అలాగే ఈవీఎంల విశ్వసనీయతను కూడా రాహుల్ ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత రాజ్యాంగంలో మార్పులు చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పురి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: BJP: వారిపై చర్యలు తీసుకోవాలి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి మహా ర్యాలీ చేపట్టింది. రామ్‌లీలా మైదానంలో ప్రతిపక్ష నేతలంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో సునీతా కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. ఇలా ప్రతిపక్ష నేతలంతా పాల్గొని.. కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Dil Raju: విజయ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ