ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల్లోగా బదిలీ కావాలని ఈసీ పేర్కొంది. అంతేకాకుండా.. తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న ఈసీ తెలిపింది.
Vizag MP Seat: వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి..
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు:
ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి
పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి.
గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు
చిత్తూరు జిల్లా ఎస్పీ జాఘవా
అనంతపురం జిల్లా ఎస్పీ అన్భురాజన్
నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి.
బదిలీ అయిన ఐఏఎస్ అధికారులు:
అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి
కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు
తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాపై బదిలీ వేటు పడింది.