Fire Accident At Forest: రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన మంటలు భారీగా వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. దేవస్థానం కార్యాలయంలో తాగిన మద్యం బాటిల్స్, తిని పాడేసిన బిర్యానీ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆలయ సిబ్బంది నిర్వాహకంగా అనుమానిస్తున్నారు.
తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా…
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
Rabi Season : గోదావరి జిల్లాలో రబీ సాగు కోసం డెల్టా కాలువలకు డిసెంబర్ 1 నుంచి ధవళేశ్వరం బ్యారేజి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి అధ్యక్షతన జరిగిన తూర్పుగోదావరి జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2024- 25 రబీ సీజన్ లో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాల పరిధిలో 8 లక్షల 96 వేల 507 ఎకరాల ఆయకట్టుకు సాగు, మంచినీటి అవసరాలకు నీటిని…
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 18 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మృతితో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి కందుల దుర్గేష్.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.…