East Godavari: తూర్పు గోదావరి జిల్లాలోని రాజా నగరంలో గల ఈవీఎంలు భద్రత పరిచిన ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని నో మేన్ జోన్ గా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మధవీ లత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ బలగాల ఆధీనంలో క్యాంపస్ ఉంటుందని తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ వరకూ యూనివర్సిటీ బోధన, పాలనా కార్యకలాపాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4వ తేదీన జరగనుంది.. అప్పటి వరకూ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్ట్రాంగ్ రూములతో పాటు వర్సిటీ ప్రాంగణమంతటా సాయుధ బలగాలతో మూడు షిఫ్టులలో విధులు నిర్వహించనున్నారు అని పేర్కొన్నారు.
Read Also: Telangana Cabinet: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఈసీ నిర్దిష్ట షరతులతో చర్చ
అలాగే, కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకూ ఈ ప్రాంతానికి కిలో మీటరు పరిధి వరకు 144 సెక్షన్-సీ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మధవీ లత ప్రకటించారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర నిత్యం గెజిటెడ్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు అని చెప్పుకొచ్చారు. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే భారతీయ శిక్షా స్మృ తి-1860 సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటానుని కలెక్టర్ మాధవీ లత హెచ్చరికలు జారీ చేశారు.