Dowleswaram Barrage: తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వరద నీరు వృథాగా సముద్రంలో కలిసి పోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు వృథాగా పోయిన 2000 టీఎంసీల వరద నీరుని అధికారులు సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Read Also: AC in Car: ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో తెలుసా?
గత నెల 26వ తారీఖున 13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయగా.. ప్రతి రోజు లక్ష నుంచి 50 వేల క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం తగ్గుతూ వస్తుంది. ఈ విధంగా లక్షలాది క్యూసెక్కుల వరద నీరు వృథాగా అంతర్వేది దగ్గర సముద్రంలో కలిసి పోతుంది.