East Godavari Tragedy: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత నాలుగు నెలలుగా తన కుమార్తె కనిపించడం లేదని మనస్థాపనతో కొవ్వూరులో ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాపు తమ్ముళ్లు కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నారట. పార్టీ అధికారంలో ఉన్నా.. తమకు ప్రయారిటీ ఉండడంలేదంటూ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు జిల్లాలో. అటు టీడీపీ అధిష్టానం వ్యవహారం కూడా అలాగే ఉందని, కనీసం తమ గోడు విన్న పాపాన పోలేందంటూ ఓపెన్‌గానే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు సీనియర్ లీడర్స్.
Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఆగిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం బయలు దేరారు. కానీ వాతావరణం అనుకూలించక గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో తిరిగి ల్యాండ్ అయింది సీఎం హెలికాప్టర్. ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లి అక్కడ నుంచి షెడ్యూల్ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించేందుకు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రోజు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటనలో.. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు..
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు అక్రమ గంజాయి నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న భార్యాభర్తలు, వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఒక వ్యాన్, కారు, రెండు మోటారు సైకిల్లను, రేకుల షెడ్ సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి కేసుకు సంబంధించిన వివరాలను రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్ వెల్లడించారు. రాజానగరం మండలంలో కొండగుంటూరు కొండాలమ్మ గుడి సమీపంలో ప్రైవేట్ లే అవుట్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలో తొలుత బంద్ ప్రకటన వెలువడిన క్రమం తదితర అంశాల మీద ఏపీ డిప్యూటీ సీఎం అధికారులతో చర్చించారు. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన…
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు కీలకం. గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్‌గా కూటమికి పట్టం కట్టింది.. ఫలితాలలో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. రెండు జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.. గత ఎన్నికల్లో టిడిపి 22, జనసేన 11 స్థానాల్లో, బిజెపి ఒక చోట పోటీ చేసి గెలిచాయి. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 21 సీట్లలో పోటీ చేస్తే అందులో 11 ఉమ్మడి ఉభయ గోదావరి…
HIT 3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ మద్ద మంచి హిట్ టాక్ తో కలెక్షన్లు రాబట్టింది. చాలా ఏరియాల్లో బిజినెస్ కు మించి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం లాభాలు రాలేదంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై తూర్పు గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన జేపీఆర్ ఫిలిమ్స్ సంస్థ…
మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఓ వ్యక్తి.. ఈ సమయంలో.. సదరు మహిళ కూతురుపై కన్నేశాడు.. దీంతో, నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఆమెను వేధించసాగాడు.. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెన తనకిచ్చి పెళ్లి చేయాలని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.