Thalliki Vandanam: ‘తల్లికి వందనం’ అమ్మకు వద్దు.. నాన్నకు ఇవ్వండి..! చిన్నారుల విజ్ఞప్తి
- తల్లికి వందనం సొమ్ము మా అమ్మకు ఇవ్వొద్దు..
- మా చదువు, పోషణ చూస్తోన్న మా నాన్నకే ఇవ్వండి..
- అధికారులకు ఇద్దరు చిన్నారుల విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. విద్యార్థుల బాధ్యతను తీసుకుంది.. ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా.. తల్లికి వందనం పథకం కింద.. అందరికీ ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం.. ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ సొమ్ము జమ చేశారు.. అయితే, తల్లికి వందనం సొమ్ము మా అమ్మకు ఇవ్వొద్దు.. నాన్నకు ఇవ్వండి అంటూ ఇద్దరు చిన్నారులు అధికారులను ఆశ్రయించడం చర్చగా మారింది..
Read Also: Motorola Edge 60 Fusion vs OnePlus Nord CE 5: మిడ్ రేంజ్ లో ఏ ఫోన్ బెస్ట్..? ఎందుకు..?
Also Read
- BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
- Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో అక్కాచెల్లెళ్ల వినూత్న ఆలోచనతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందన పథకం అమ్మ నుంచి పథకం ద్వారా వచ్చే డబ్బులు మా నాన్నకు ఇవ్వండి అంటూ అక్కాచెల్లెళ్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఐదేళ్లుగా నాన్న వద్ద ఉంటున్నామని.. తల్లి తమను వదిలి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతేకాదు, ప్రతిసారి మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలు అమ్మకే వెళ్తున్నాయి.. కానీ, మా చదువుకు, అవసరాల కోసం ఎన్ని సార్లు అడిగినా డబ్బులు ఇవ్వడం లేదంటూ ఆవేదన చెందారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం, పీజీఆర్ఎస్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద కూడా అర్జీలను ఇచ్చామని బాధిత అక్కా చెల్లెలు వాపోయారు. మరి విద్యార్థినుల అభ్యర్థనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..
తాజావార్తలు
-
BJP: రాహుల్ గాంధీ డ్రామాలు వీడియోల కోసమే.. బీజేపీ నేతల విమర్శలు..
-
Tarique Rahman: శాంతించిన తారిఖ్ రెహమాన్.. ఎల్లుండి భారత్‌లో పర్యటన!
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!