HIT 3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ మద్ద మంచి హిట్ టాక్ తో కలెక్షన్లు రాబట్టింది. చాలా ఏరియాల్లో బిజినెస్ కు మించి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం లాభాలు రాలేదంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై తూర్పు గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన జేపీఆర్ ఫిలిమ్స్ సంస్థ స్పందించింది. తాజాగా దానిపై ట్వీట్ చేసింది. హిట్-3ని తామే తూర్పు గోదావరిలో డిస్ట్రిబ్యూట్ చేసినట్టు స్పష్టం చేసింది.
Read Also : IndiGo Flight: గాల్లో ఇండిగో విమానంపై పిడుగు.. వీడియో వైరల్
తమకు నిన్నటి వరకు అన్ని ఖర్చులు పోను లాభాలు వచ్చాయంటూ ప్రకటించింది. తమకు ఈ అవకాశం ఇచ్చిన హీరో నానికి, వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ కు థాంక్స్ చెప్పింది. గతంలో తమకు కోర్టు సినిమాను ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చారని.. ఇప్పుడు ఈ ఛాన్స్ ఇచ్చారంటూ రాసుకొచ్చింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిట్-3 ప్రాంచైజీలో నాని స్వయంగా నటిస్తూ నిర్మించారు. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.
Read Also : Delhi: “24 గంటల్లో వెళ్లిపో”.. మరో పాక్ హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన భారత్
We @JprFilms distributed #HIT3 in East Godavari region. As on yesterday we recovered our NRA amount including expenses. We thank @nameisnani and @walposterCinema for giving us the opportunity to distribute two consecutive hits #CourtTheMovie and #HIT3.
— JPR FILMS (@JprFilms) May 21, 2025