తూర్పుగోదావరిలో మళ్లీ లాక్‌డౌన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చారు. వారాంతపు సంతలు పూర్తిగా నిలిపి వేశారు. అనవసరంగా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు పోలీసులు.
జిల్లాలో పలు మండలాలు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారాయి.. దీంతో తిరిగి జిల్లాలో లాక్ డౌన్ అమలుకు యంత్రాంగం సిద్దపడుతోంది. అయితే జిల్లా మొత్తం ఒక యూనిట్‌గా కాకుండా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న మండలాల వారీగా లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా పి గన్నవరం మండలంలో తిరిగి లాక్‌డౌన్ విధించారు. . అలాగే రాజమండ్రిలో కూడా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయ్. లాక్‌డౌన్ సడలింపులు తర్వాత ఈ రెండు నగరాల్లోనూ మార్కెట్లకు జనం పోటెత్తుతున్నారు. దుకాణాలు, మాల్స్ రద్దీగా మారాయ్. ఇందుకు తగ్గట్లే ఈ నగరాల్లో కొత్త కేసులు నమోదు అధికంగా ఉంది. కేసుల సంఖ్య అదుపులోకొచ్చే వరకు కొత్త నిబంధనలు అమలవుతాయని అంటున్నారు అధికారులు.
Also Read
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!