ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం.. అసలు రైతును మించిన గురువే లేడని వ్యాఖ్యానించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అంతరాష్ట్ర అరటి మార్కెట్ పరిశీలించిన ఆయన.. అరటి గెలలు అమ్ముకుంటున్న రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును మించిన గురువు లేడన్నారు.. నేను 12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నానని.. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు, ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు.. రైతులకు ఉచిత విద్యుత్ 12 గంటలకు పెంచాలని డిమాండ్ చేసిన లక్ష్మీనారాయణ.. ఉపాధి హామీ పథకం ద్వారా యాభై శాతం కూలీలు రైతుల పొలాల్లో పనిచేయాలన్నారు.. అరటి రైతుల ఆదాయం పెరిగే మార్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. ఇక, రావులపాలెం అరటి మార్కెట్ కు విచ్చేసిన సందర్భంగా రైతు నాయకుడు జేడీ లక్ష్మీనారాయణ అంటూ నినాదాలు చేశారు రైతులు.