గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.. భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గినా.. ఇంకా, పూర్తిస్థాయిలో తగ్గింది మాత్రం లేదు.. గోదావరిలో వరద ఉధృతి ఉండడంతో.. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత నీటిమట్టం 20.2 అడుగులుగా ఉందని.. వరద ప్రవాహం 23 లక్షల 30వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు.. దీంతో, మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.. గోదావరిలో ప్రస్తుత పరిస్థితిపై…
గోదావరి పోటెత్తుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడిపోతున్నాయి. దాదాపు లంక గ్రామాలన్నీ గోదావరి ప్రతాపానికి నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రిలీఫ్ ఆపరేషన్‌లో ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎన్ని ఏపీఎస్టీఆర్ఎఫ్ బృందాలు నెలకొన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 3వ బెటాలియన్ నుండి APSDRF-2 బృందాలు (70 మంది సిబ్బంది): అల్లూరి సీతారామరాజు జిల్లాలోని V.R పురం, కూనవరం గ్రామాలకు చెందిన 222 మంది గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు…
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది గత రెండు రోజులుగా ఉప్పొంగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 4.4 అడుగుల వద్ద ఉంది. దీంతో 3 లక్షల 69 వేల 259 క్యూసెక్‌ల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా గోదావరి వరద నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. స్పిల్ వే ఎగువన 30.050 మీటర్లు, దిగువన…