ఎవరో వస్తారని ఏదో చేస్తారని, ప్రభుత్వం రావాలని రైతులు చూడడం లేదు. జనసైనికుల సాయంతో తమ పంట పొలాలకు నీటిని శుభ్రం చేసే కాలువల్ని శుభ్రం చేసుకున్నారు. కాకినాడ రూరల్ గంగనాపల్లి పంటకాలువలో గుర్రపు డెక్కను తొలగించారు జనసైనికులు.జనసేన PAC సభ్యుడు పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసైనికులు గుర్రపు డెక్కను తొలగించి పంట కాలువను శుభ్రం చేసే పని చేపట్టారు.
ప్రభుత్వం కర్తవ్యాన్ని గుర్తు చేయడానికే తాము పంట కాలువ శుభ్రం చేసే పని చేపట్టామని పంతం నానాజీ అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులు ధాన్యం తూసి నెలలు గడుస్తున్నా డబ్బు ఇవ్వరూ, కాలువల్లో పూడికలు తీయించరు ఇదేమీ ప్రభుత్వం అంటూ నానాజీ ప్రశ్నించారు. మూడు గ్రామాల పరిధిలోని 1500 ఎకరాల పంట భూమికి నీరందించే ఈ కాలువ పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయింది.
గత పదిరోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నా నారుమళ్లకు రైతులు గుర్రాలతో నీరు తోడుకుంటున్నారంటే ఈ కాలువ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్ధమవుతోంది అని పంతం నానాజీ అన్నారు. కాలువలు శుభ్రం చేయిఃచవలసిన ఫీల్డ్ అసిస్టెంట్లను వారి పనులు వారిని చేసుకోనివ్వకుండా అధికార పార్టీ ప్లీనరీ పనులకు వారిని వినియోగించుకుంటున్నారని నానాజీ ఆరోపించారు. ప్రభుత్వం తీరు మారకపోతే కొన్నాళ్ళకు రాష్ట్రంలో వ్యవసాయం చేయడానికి ఎవరూ ముందుకు రారని నానాజీ అన్నారు.
Pawan Kalyan: ఎస్సీ యువతపై నాన్ బెయిలబుల్ కేసులా?