Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ సమీపిస్తున్న సందర్భంగా గుడిమెల్లంకలో స్థానిక ఓబెరు చర్చిలో అప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 70 కిలోల స్టార్ లైట్‌ను చర్చి పిల్లర్‌కు కడుతుండగా సిమెంట్ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చెలిమి శివకృష్ణ (27) అనే యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. అయితే స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. Read Also: Andhra Pradesh: ప్రత్తిపాడులో రెండు లారీలు…
Telugu Desam Party: టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 1న తూ.గో. జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు. కొవ్వూరులో చంద్రబాబు పర్యటించడంతో పాటు బహిరంగ సభలోనూ పాల్గొంటారు. పార్టీ అధినేత వస్తున్న నేపథ్యంలో కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఈ కమిటీలో సుబ్బరాయచౌదరి, రామకృష్ణ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు సభ్యుల కమిటీ సభా వేదికపైకి వచ్చేవారి జాబితాలో మాజీ మంత్రి జవహర్ పేరు చేర్చకపోవడం…
Nallamilli Moola Reddy Passes Away: తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి (80) సోమవారం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నల్లమిల్లి మూలారెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. అనపర్తి నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం రామవరంలోనే ఉంటున్న మూలారెడ్డి ఆది నుంచి టీడీపీ నేతగానే కొనసాగారు. 1970లో రామవరం సర్పంచ్ గా మూలారెడ్డి ఎన్నికయ్యారు. అనపర్తి నియోజకవర్గం నుంచి…
మీకు భూములు ఉన్నాయా? భూముల పేరుతో బ్యాంకులో అప్పు తీసుకున్నారా? ఒకవేళ తీసుకోకపోతే.. మీ భూమి ఎవరి పేరుతో ఉంది..? బ్యాంకులో అప్పులు ఉన్నాయా అర్జెంటుగా ఒక్కసారి చెక్ చూసుకోండి. ఇదంతా ఎందుకంటారా..? ఎందుకంటే మీకు తెలియకుండానే కొందరు మోసగాళ్లు మీ పేరున లీజు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదో కొత్త తరహా మోసం. లీజు అగ్రిమెంట్ ఆధారంగా బ్యాంకు నుంచి అప్పులు దర్జాగా పొందుతున్నారు. ఇప్పుడు తూ.గో. జిల్లాలోని కడియం ప్రాంతంలో ఈ తరహా మోసం…
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,300 మందికి, పరోక్షంగా 1,150 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే…
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (OTS) కింద ఖజానాకు బాగానే డబ్బులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో కలిపి రూ.339 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 9.86 లక్షల మంది లబ్ధిదారులు రూ.10,000 చొప్పున చెల్లించి తమ ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అత్యధికంగా వినియోగించుకున్న లబ్ధిదారుల జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉండటం…
తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన ఓ చెల్లెలు దారుణ హత్యకు గురైంది. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన కొవ్వాసి నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో తన అక్క దగ్గర నివసిస్తోంది. ఇటీవల అన్నను చూసేందుకు కన్నాపురం గ్రామానికి వచ్చింది. అయితే కొవ్వాసి నంద భార్య రెండు రోజుల క్రితం పుట్టింటికి…
తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదివే పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకు ఒక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది యువకుడు ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… రాయవరం మండలం పసపూడికి చెందిన ఒకరు వ్యవసాయ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్న ఆయన కుమారుడు సెలవు రోజున ఇంటికి వచ్చాడు. తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులపై…
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈనెల 2న కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. లోదొడ్డి గ్రామ వాలంటీర్ వంతల రాంబాబు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను వారు వెల్లడించారు. మృతుల్లో ఒకరి భార్యతో రాంబాబు సన్నిహితంగా ఉండేవాడని.. గత నెలలో అతడు సన్నిహితంగా ఉన్న మహిళ మరిదితో గొడవ జరిగిన కారణంగా గ్రామ పెద్దలు…