త్వరలో జరగనున్న ఐపీఎల్-2022 వేలం బరిలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు కుర్రాడు 29 ఏళ్ల బండారు అయ్యప్ప అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మీడియం పేస్ బౌలర్‌గా, రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా అయ్యప్ప రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 లీగ్‌లో అయ్యప్పను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. Read Also: ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడంపై గంగూలీ…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగి ఐదుగురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలం లొదొడ్డిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తొలుత బుధవారం ఉదయం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు కల్లు తాగడానికి వెళ్లారు. అయితే వారు కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. Read Also: ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు: సోము వీర్రాజు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి…
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లలో తేడాలు కనిపించాయి. కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రాజమండ్రి జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. అయితే ప్రభుత్వం విడుదల…
ఏపీలో ఓటర్ల లెక్కలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో మొత్తం 4,07,36,279 మంది ఓటర్లు ఉన్నట్లు సీఈసీ వెల్లడించింది. పురుష ఓటర్లు 2 కోట్ల ఒక లక్ష 34 వేల 664 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2 కోట్ల 5 లక్షల 97 వేల 544 మంది ఉన్నారు. దీంతో పురుషుల కంటే 4,62,880 మంది మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తం ఓటర్లలో 4,06,61,331 మంది సాధారణ ఓటర్లు, 7,033 మంది…
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం బ్రహ్మపూరి గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పట్ల కులవివక్షత చూపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన విద్యార్థులకు ఒక పాఠశాల, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు మరో పాఠశాల ఏర్పాటు చేసి బోధన ..దీంతో కుల వివక్షతకు ఆజ్యం పోసిన మండల విద్యాశాఖ అధికారులు. గ్రామ పంచాయితీ సర్పంచ్ సూచనలు మేరకు విద్యార్థుల మధ్య కుల విభజన చేశారంటూ ఆరోపణలు…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ పెడుతున్నారని ఇటీవల తీవ్రస్థాయిఓ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, బీసీ, కాపు కులాలకు ముద్రగడ రాసిన లేఖ కొత్త పార్టీ ఏర్పాటుపై సంకేతాలు పంపింది. ఏపీలో తక్కువ జనాభా కలిగిన వర్గాల వారు అధికారం అనుభవిస్తున్నారని… ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయాలని లేఖలో ముద్రగడ ప్రస్తావించారు. ఎప్పుడూ పల్లకి మోయడం కాదని.. మనం పల్లకిలో కూర్చునేలా…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్‌లో అడుగుపెట్టింది.. క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూనే ఉంది.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే కాగా… తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలోనూ ఒమిక్రాన్ వెలుగు చూసింది… తూర్పు గోదావరి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది.. దీంతో.. కోనసీమలో కలకలం మొదలైంది. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. బాధితురాలు ఇటీవలే గల్ఫ్ నుంచి వచ్చినట్టుగా…
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తూర్పు మన్యంలోని మారేడుమిల్లిని చలి వణికిస్తుంది. చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ర్టంలో వరుసగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తన ప్రభావాన్ని చూపిస్తుంది. పగటి పూట సైతం చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. Read Also: హైదరాబాద్‌లో రికార్డు సృష్టించిన ‘చలి’ మారేడు…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కోలమూరులో యువకుడి హత్య సంచలనం రేపుతోంది. గత నెల 24న నాగసాయి అలియాస్ వెంకటేష్ (25) అనే యువకుడిని నలుగురు నిందితులు హత్య చేశారు. వెంకటేష్ మృతదేహాన్ని నిందితులు ముక్కలు చేసి రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమకు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Read Also: కన్న బిడ్డకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేసిన…
ఏపీ ప్రజలను మరో తుఫాన్ హడలెత్తిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్ మారి ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖకు 670 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో క్రమంగా వాతావరణం మారుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలలో అలజడి మొదలైంది. ఈదురుగాలుల తాకిడి కూడా పెరుగుతోంది. గంటకు 45 నుంచి 50 కి.మీ. మేర వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా,…