తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా ఈరోజు ఉదయం అడవి పందిని పులి చంపి అడవి పంది మాంసాన్ని తిని పెద్దపులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వివాహితకు భర్త శిరోమండనం చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చిత్ర హింసలు ఆమెకు గుండు గీసి పరారయ్యాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసిన కర్రి అభిరామ్, ఆశలు అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్‌ను తుపాకీతో కాల్చి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో బ్యాంకుల వద్ద అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ పలు మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడులో మనోహర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి కారణం భార్య తనని పట్టించుకోకుండా టీవీ చూస్తున్నదనే కోపం. రోజూమాదిరిగానే భర్త మనోహర్ ఇంటికి వచ్చాడు. భార్య టీవీ సీరియల్ లో నిమగ్నమైపోయింది. భర్త వచ్చింది కూడా ఆమె గమనించలేదు.