తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.. భూపాలపట్నంలోని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడలో గ్యాస్ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూరగాయల దుకాణంలోకి గ్యాస్ లారీ దూసుకెళ్లింది. దుకాణం ఎదుట పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జనుజ్జయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. టీ పొడి అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకుని టీ తాగిన వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కర వనం - హౌసింగ్ బోర్డ్ కాలనీల సమీపములో అర్ధరాత్రి చిరుతపులి సంచరించిన నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 13.70 అడుగులకు వరద నీటి మట్టం తగ్గింది. బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
18వ సారి ఓటు హక్కు వినియోగించుకుని తన ప్రత్యేకత చాటుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వ్యాపారవేత్త రొంగల రాముడు. వయోవృద్ధులకు కేటాయించిన హోమ్ ఓటింగ్ ద్వారా 104 ఏళ్ల రాముడు.. 18వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిడదవోలులోనే తన స్వగృహానికి పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు. దీంతో రాముడు ఇంటి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పాలచర్ల గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్న బండి శ్రీవల్లి(4) అనే చిన్నారి మృతి చెందింది.