Earthquake: బుధవారం ములుగు జిల్లాలో సంభవించిన భూకంపంతో తెలంగాణ ఒక్కసారిగా వణికిపోయింది. తెల్లవారుజామున 7.27 గంటలకు ములుగులో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది. భూకంపం భూమి ఉపరితలం నుంచి 40 కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం సమీపంలోని మంచిర్యాల, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కూడా ప్రకంపనలు కనిపించాయి.
AP-TG Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. బుధవారం తెల్లవారుజామున తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, చర్ల, ఖమ్మంలోని మణుగూరు సహా పలు చోట్ల భూమి కంపించింది.
Earthquake: గురువారం జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8గా తీవ్రత నమోదైంది. ఒక్కసారి ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం సాయంత్రం 4.19 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్)లో పోస్ట్‌లో తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
Iran Nuclear Tests: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పెంచుతుంది. అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ 5వ తేదీన శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే టైంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు దారి తీసింది.
పాకిస్థాన్‌ను భూప్రకంపనలు హడలెత్తించాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తర భారత్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake: ఢిల్లీ-ఎన్సీఆర్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అందిన సమాచారం మేరకు భూకంప కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భూకంపం సంభవించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తుంక్వా నుండి పంజాబ్ వరకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది.…
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా.. పాకిస్తాన్, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ భూకంపం ఉదయం 11:26 గంటలకు సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.7 గా నమోదైంది.
Earthquake in Delhi NCR: గురువారం ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ, రాజధాని పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం సంభవించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ లో బలమైన భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీలో కనిపించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఢిల్లీలో భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు.. ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.. జిల్లాలోని ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది.. తెల్లవారుజామున 3:40 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకోగా.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రజలు.. భయాందోళనకు లోనయ్యారు.. మరోసారి ఉదయం 4:03 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి..
Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం వచ్చింది. బారాముల్లా జిల్లాలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ(ఎన్సీఎస్) వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతంలోని పలు జిల్లాలో ఈ భూకంప తీవ్రత కనిపించింది. ఒక్కసారిగా ప్రకంపలను రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బారాముల్లా జిల్లాలో భూమిలో 5కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని ఎన్సీఎస్ వెల్లడించింది.