7.1 తీవ్రతతో బలమైన భూకంపం ఫిలిప్పీన్స్‌ను తాకింది.. ఫిలిప్పీన్స్ ఆగ్నేయ తీరం మిండనోవాలో ఈ భారీ భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది… పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరం, భూమికి 65.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.. ఇంత భారీ తీవ్రతతో భూకంపాలు వచ్చినప్పుడు.. సాధారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తారు.. కానీ, దానికి విరుద్ధంగా ఎలాంటి సునామీ ప్రమాదం లేదని వివిధ ఏజెన్సీలు…
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, ఉప్పునుంతలలో భూమి స్వల్పంగా కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలియజేసింది. ఈ ఉదయం 5 గంటలకు భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అయితే, భూప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని సమాచారం. భారీ వర్షాలు, వరదల కారణంగా భూమి పోరల్లోకి నీరు చేరడం వలన భూప్రకంపనలు వచ్చి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. …
నెల్లూరు జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో ప్రజలు భయాంధోళనలకు గురయ్యి బయటకు పరుగులు తీశారు. దాదాపు మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో ఈ ఘటన జరిగింది. స్వల్పంగా మాత్రమే భూమి కంపించడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు భూమి కంపించడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో భూకంపాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి. సముద్రతీర ప్రాంతం కావడంతో ఈ జిల్లాకు వానలు,…