Earthquake: తెలంగాణలో ఈరోజు మరోసారి భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి కేంద్రంగా పలుచోట్ల భూమి కంపించింది. భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. అయితే ఈ భూకంపంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read also: Ambulance Theft: 108 అంబులెన్స్ చోరీ చేసిన దొంగ.. సినీ ఫక్కిలో సాగిన చేజింగ్ ఆట..
అయితే సరిగ్గా మూడు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా భూకంపం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. తొలుత ములుగు జిల్లాలోని మేడారం, మారేడుపాక, బోర్లగూడెం మధ్య ప్రాంతంలో ప్రకంపనలు నమోదయ్యాయి. భూగర్భంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు.
Cancer Medicine : క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ మూడు మందులపై ధరల తగ్గింపు