విపత్తులను జంతువులు గానీ.. పక్షులు గానీ ముందుగానే పసిగడతాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇలాంటి ఘటనలు కూడా ఆయా సందర్భాల్లో కూడా వెలుగుచూశాయి. భూకంపాలు వచ్చినప్పుడు.. కుక్కలు ముందుగా పసిగట్టి యజమానులను రక్షించిన సందర్భాలు చూలా చూశాం. విన్నాం. ఇది శాస్త్రీయంగా కూడా రుజువైంది. తాజాగా కాలిఫోర్నియాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: త్వరలో ఆంధ్ర యూనివర్సిటీపై కీలక ప్రకటన..
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా తీర ప్రాంతంలో గురువారం (డిసెంబర్ 5) ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7కు పైగా నమోదైంది. దీంతో జాతీయ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఈ భూకంపానికి ముందు ఓ సరస్సులో ఉన్న పక్షులు పసిగట్టి పైకి ఎగిరిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రకంపనల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదు. అలాగే ఎవరికీ గాయాలు కాలేదు. ఫెర్న్‌డేల్ పట్టణానికి పశ్చిమాన 39 మైళ్ల (63 కిమీ) దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.