Earthquake in Los Angeles: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్) తెలిపింది. చైనాటౌన్ సమీపంలోని హైలాండ్ పార్క్‌కు దక్షిణ ఆగ్నేయంగా 2.5 మైళ్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12:20 గంటలకు భూకంపం సంభవించింది. లాస్ఏంజిల్స్ ప్రాంతం నుంచి మెక్సికో సరిహద్దులోని శాన్‌డియాగో వరకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో పలు ఇళ్లలోని…
Earthquake : ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 10:54 గంటలకు చాలా తేలికపాటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.4గా నమోదైంది.
Earth Quake in Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో నేడు భూకంపం సంభవించింది. కాశ్మీర్ లోని బారాముల్లాలో ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దింతో వారు రోడ్లపైకి పరుగులు తీశారు. ఇకపోతే, ఈరోజు మధ్యాహ్నం 12:25 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం తర్వాత బారాముల్లాలో ప్రజలలో గందరగోళం నెలకొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో…
ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. జూలై 1న మధ్యాహ్నం 3:51 గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 4.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 139 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
Earthquake : కాలిఫోర్నియాలో మరోసారి భూకంపం సంభవించింది. జూన్ 24వ తేదీ సోమవారం సాయంత్రం ఇక్కడ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.1గా నమోదైంది.
Earthquake : ఈశాన్య ఇరాన్ (Iran) ప్రావిన్స్ ఖొరాసన్ రజావి లోని కష్మర్ కౌంటీలో సంభవించిన భూకంపం 5.0 తీవ్రతతో సంభవించింది. ఈ నేపథ్యంలో సమాచారం అందినమేరకు నలుగురు మరణించారు. అలాగే 120 మందికి పైగా గాయపడినట్లు మీడియా నివేదించింది. గాయపడిన వారిలో 35 మంది ఆసుపత్రి పాలయ్యారు. మిగిలిన వారు చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని అధికారిక వార్తా సంస్థ మంగళవారం కాష్మార్ గవర్నర్ హోజ్జతోల్లా షరియత్మదారి పేర్కొంది. భవనం ముఖ భాగాల నుండి…
మణిపూర్‌లో భూకంపం సంభవించింది. కామ్‌జోంగ్‌లో ఈరోజు ఉదయం 5:32 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది.
ఉత్తర్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యూపీలోని సోన్‌భద్రలో ఆదివారం మధ్యాహ్నం 3.49 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది.
మణిపూర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున మణిపూర్‌లోని చందేల్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో.. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
తజికిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0గా నమోదైంది. మంగళవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది.