నేపాల్లో 157 మందిని బలిగొన్న భూకంపం.. ఇప్పుడు ఢిల్లీని తాకింది. సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:42 గంటలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించండంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
నేపాల్లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం దాటికి మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విపరీతమైన చలిలో వీధుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తైవాన్ రాజధాని తైపీలో మంగళవారం ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.. భూకంపం సమయంలో తైపీలోని భవనాలు కంపించాయి. మంగళవారం ఉదయం నేపాల్‌లో మరోసారి భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 4:17 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Earthquake: నేపాల్లో మళ్లీ భూకంపం. ఈరోజు (ఆదివారం) ఉదయం 7.24 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Nepal Earthquake: నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 7.39 గంటలకు..బాగ్మతి, గండకి ప్రావిన్స్‌లలో కూడా భూకంపం సంభవించింది.
Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఈ భూకంప ప్రకంపనలు పితోర్‌ఘర్ జిల్లాకు ఈశాన్యంగా 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భావించారు.
Breaking News: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.08 గంటలకు హర్యానా ఫరీదాబాద్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) వెల్లడించింది. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి.
Afghanistan Earthquake: తాలిబాన్ పాలనతో పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్ఘానిస్తాన్ వరస భూకంపాలతో అల్లాడుతోంది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా భూకంప తీవ్రత నమోదైంది. గత వారం పశ్చిమ హెరాత్ ప్రావిన్సుల్లో భూకంపం వచ్చిన చోటే మరోసారి భూకంపం చోటు చేసుకుందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.