ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబరు 7న ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ ప్రావిన్సుల్లో సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. భూకంపం ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి
Afghanistan Earthquake: పేదరికం, ఉగ్రవాదంతో కష్టంగా బతుకీడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో శనివారం భారీ భూకంపం సంభంవించింది. హెరాత్ ప్రావిన్సులో సంభవించిన భూకంపం ధాటికి 1000 మందికి పైగా చనిపోయినట్లు తాలిబాన్ అధికారులు ప్రకటించారు. 12 గ్రామాల్లో 600 ఇళ్లు ధ్వంసమైనట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది.
Earthquake: ఈ రోజు తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడిచింది. అండమాన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ ఆఫ్ఘన్‌లోని హెరాత్ ప్రావిన్సులో శనివారం 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ధాటికి ఇప్పటి వరకు 14 మంది మరణించగా.. 78 మంది గాయపడ్డారు. చాలా భవనాలు కూలిపోయాయి. కూలిన భవనాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఉత్తర భారతాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. నేపాల్‌లో 6.2 భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
నేపాల్‌లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత ఈరోజు ఢిల్లీలో భారీ ప్రకంపనలు సంభవించాయి. రియాక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. ఢిల్లీతోపాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. నోయిడాలో 10 నుంచి 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది.
Earthquake: వచ్చే 48 గంటల్లో పాకిస్తాన్ లో భారీ భూకంపం సంభవించవచ్చని డచ్ శాస్త్రవేత్త హెచ్చరించారు. నెదర్లాండ్స్‌కి చెందిన సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (SSGEOS) పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం వస్తుందని అంచనా వేసింది. డచ్ పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 1-3 మధ్య ఎప్పుడైనా భూకంపం రావచ్చని తెలిపారు. ప్రపంచంలో వచ్చే మేజర్ భూకంపాలను అంచనా వేయడంలో ఫ్రాంక్ దిట్ట.
Earthquake: ఈశాన్య రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. మేఘాలయ రాష్ట్రంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. సాయంత్రం 6.15 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రెసుబెల్పరా జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ గారో హిల్స్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
ఇటలీలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ ప్రకారం, దాని భూకంప కేంద్రం ఫ్లోరెన్స్‌కు ఈశాన్యమైన మరాడి సమీపంలో ఉందని నివేదించింది.