Iceland Earthquakes: 14 గంటల వ్యవధిలో 800 భూప్రకంపనలు.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఐస్‌లాండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
800 earthquakes in 14 hours at Iceland: వరుస భూప్రకంపనలతో ఐస్‌లాండ్ వణికిపోతోంది. సుమారు 14 గంటల వ్యవధిలో 800 ప్రకంపనలు సంభవించాయి. రెక్జానెస్ ప్రాంతంలో శక్తివంతమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వరుస భూకంపాల కారణంగా గ్రిండవిక్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుందనే భయంతో ఐస్‌లాండ్ శుక్రవారం అత్యవసర పరిస్థితిని (Iceland Emergency) ప్రకటించింది. గ్రిండవిక్‌లో నివసిస్తున్న వేలాది మందిని ఖాళీ చేయమని స్థానిక అధికారులు ముందుజాగ్రత్తగా ఆదేశాలు జారీ చేశారు.
ఐస్‌లాండ్‌లో శుక్రవారం (నవంబర్ 10) సాయంత్రం రాజధాని రెక్జావిక్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. ప్రకంపనలతో అక్కడి రహదారులు ధ్వంసం కావడంతో.. రాకపోకలను నిలిపివేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 800 ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు అంటున్నారు. అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్ ప్రాంతంలో ఏకంగా 24 వేల ప్రకంపనలు సంభవించాయి.
Also Read
- US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
Also Read: Chandra Mohan: చంద్రమోహన్‌తో నటిస్తే చాలు.. స్టార్స్ అయిపోతారు!
ఇటీవలి వారాల్లో ఫాగ్రాడల్స్‌ఫ్జల్ అగ్నిపర్వతం చుట్టూ వేలాది ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని ఐస్‌లాండ్ వాతావారణ విభాగం అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో విస్ఫోటం సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో గ్రిండావిక్ అనే జనావాస ప్రాంతం ఉంది. అక్కడ నాలుగు వేల మంది ప్రజలు నివసిస్తుండగా.. ముందస్తు జాగ్రత్తగా అక్కడి నుంచి వారిని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐస్‌లాండ్ శుక్రవారం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!