Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ భాగంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఇప్పటి వరకు నష్టానికి సంబంధించిన అంచనాలు తెలియరాలేదు. దక్షిణ ద్వీపమైన మిండానాలోలోని సారంగని ప్రావిన్స్‌లో భూకంప వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భూమి అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు చేయలేదు. ప్రాణనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదు, కానీ పర్వతాలు ఎక్కువగా ఉన్న ద్వీపంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.
Read Also: Deepfakes: “డీప్‌ఫేక్” అతిపెద్ద ముప్పు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- 43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
- Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
తాను ఇప్పటి వరకు చూసిన అత్యంత బలమైన భూకంపం ఇదే అని 27 ఏళ్ల కిషియా లేరాన్ తెలిపారు. ఆమె భూకంప కేంద్రం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో ఉంటున్నాడు. అక్కడ సమావేశంలో ఉన్న సమయంలోనే భూకంపం వచ్చిందని, తన చుట్టూ ఉన్న వ్యక్తులు భయాందోళనతో పరుగులు తీశారని చెప్పింది.
జపాన్ నుంచి ఆగ్నేయాసియా వరకు ఉన్న పసిఫిక్ బేసిన్ భూకంపాలు, అగ్నిపర్వతాలకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతాన్ని ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలోనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక్కడి సముద్ర గర్భంలో వందల సంఖ్యలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలిక ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!