నేపాల్లో 157 మందిని బలిగొన్న భూకంపం.. ఇప్పుడు ఢిల్లీని తాకింది. సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Read Also: SL vs BAN: శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్లో అనూహ్య ఘటన.. ఒక్క బాల్ ఆడకుండానే..!
మూడు రోజుల్లో భూకంపాలు సంభవించడం ఇది రెండోసారి. ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు తెలిపారు. నేపాల్ లో శుక్రవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ లో ఏర్పడిన ప్రకంపనలు ఇప్పుడు ఢిల్లీకి వ్యాపించాయి.
Earthquake of Magnitude:5.6, Occurred on 06-11-2023, 16:16:40 IST, Lat: 28.89 & Long: 82.36, Depth: 10 Km ,Region: Nepal for more information Download the BhooKamp App https://t.co/TXMwjzCLks @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/HM8ZaYMlZH
— National Center for Seismology (@NCS_Earthquake) November 6, 2023
Read Also: TPGL 2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్ 3 విన్నర్‌గా ఆర్య వారియర్స్