Earthquake: మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం (NSC) ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. భూకంప కేంద్ర 20 కిలోమీటర్లు.
Morocco Earthquake: శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించడంతో జనం భయంతో పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత 6.8గా ఉంది. ఈ ఘటనలో దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 670 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మొరాకో భూకంపం పై ప్రపంచ దేశాలన్నీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.…
శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 672 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Earthquake: ఆఫ్రికా దేశమైన మొరాకోలో అర్థరాత్రి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు మీద 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. ఇప్పటి వరకు దాదాపు 300 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
Indonesia EarthQuake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇండోనేషియాలోని మాతరాంకు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా భూ అంతర్భాగంలో…
ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఉదయం 8.05 గంటలకు భూకంప ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం ఇచ్చింది.
Warangal Earthquake: వరంగల్, మణుగూరులో ఇవాళ తెల్లవారుజామున 4.43 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతాల్లో భూమి కంపించింది.
జమ్ముకశ్మీర్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇప్పటికే మూడుసార్లు జమ్ము కశ్మీర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుసార్లు భూమి కంపించింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం మరోసారి వచ్చింది. ఇవాళ ( శుక్రవారం ) తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్ట్ బ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రికార్ట్ స్కేలుపై 4.3 గా నమోదు అయిందని సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
జమ్మూ కాశ్మీర్లో ఇవాళ( మంగళవారం ) తెల్లవారు జామున తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్ మీద దీని తీవ్రత 37గా నమోదైంది. ఈరోజు తెల్లవారు జాము 12.04 గంటలకు ధోడా ప్రాంతానికి ఆగ్నేయంగా ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫార్ సీస్మాలజీ తెలిపింది.