Afghanistan :ఆఫ్ఘనిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆఫ్ఘనిస్థాన్లో ఈరోజు ఉదయం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది.
Earthquake : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ రోజు తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి. తమిళనాడులోని ఉత్తర జిల్లాలో శుక్రవారం 3.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
Earthquake: ఓషియానియా ప్రాంతంలో ఉన్న ద్వీప దేశం వనాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ చిన్న దేశం భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వనాలకు దక్షినంగా గురువారం ఈ భూకంపం వచ్చిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రారంభంలో దీని తీవ్రత 7.3గా అనుకున్నప్పటికీ ఆ తర్వాత సవరించి 7.1గా వెల్లడించింది. భూమికి 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.
Earthquake: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ వరస భూకంపాలతో భయపడుతోంది. గత రెండు మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళతో ఉన్నారు. తాజాగా దేశంలోని లుజోన్లో మంగళవారం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా రాజధాని మనీలాలోని భవనాలను ప్రజలు ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Earthquake: ఫిలిప్పీన్స్లోని మిండనావోలో తీవ్ర భూకంపం సంభవించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సోమవారం తెల్లవారుజామున దక్షిణ ఫిలిప్పీన్స్ తీరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Earthquak: ఆసియా దేశం ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది. భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది.
Ladakh Earthquake: ఇటీవల కాలంలో ప్రపంచవ్యాస్తంగా భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోని ఏదోక ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. శనివారం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో భూకంపం చోటుచేసుకోగా.. ఇదే రోజు లెహ్ లడఖ్లోనూ భూకంపం సంభవించడం గమనార్హం. ఇవాళ ఉదయం 8. 25 నిమిషాల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతో అక్కడ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 35.44 అక్షాంశం, 77.36 రేఖాంశంలో 10 కిలో మీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.…
Earthquake: బంగ్లాదేశ్లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. చిట్టగాంగ్లోని భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Earthquake: ఉదయమే పాపువా న్యూ గినియా, చైనా, పాకిస్తాన్తో సహా ప్రపంచంలోని మూడు దేశాలలో బలమైన భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే మంగళవారం ఈ సమాచారాన్ని ఇచ్చింది.