డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ రాక్ స్టార్ యష్‌తో కలిసి.. కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికి కూడా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కూడా అంతే క్రెడిట్ దక్కించుకుంది. దాంతో కెజియఫ్ తర్వాత అదే రేంజ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు హోంబలే అధినేతలు. ప్రస్తుతం ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమాను భారీ…
ప్రభాస్ హీరోగా పలు సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా అందులో ఒకటి. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. అమితాబ్ తో పాటు దీపిక పడుకొనె కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొత్త కార్యాలయాన్ని గచ్చిబౌలిలో ఆరంభించారు. ఈ వేడుకలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, రాఘవేంద్రరావు, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, నాని,…
పాన్ ఇండియా ఫీవర్ కారణంగా టాలీవుడ్ లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న, మధ్య తరగతి హీరోలు సైతం తెలుగులో తీసిన సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలైతే చాలానే వరుస కట్టాయి. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’, ‘యశోద’ రెండూ పాన్ ఇండియా మూవీసే. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సినిమాలనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలను బ్యాన్ చేస్తున్నారు అనే వార్త ప్రస్తుతం మాలీవుడ్ ని షేక్ చేస్తోంది. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి పేరు ఉంది. మహానటి, కనులు కనులను దోచాయంటే, కురుప్ లాంటి చిత్రాలతో తెలుగు అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోపై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. అంతేకాకుండా అతడు నటించిన చిత్రాలన్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(ఎఫ్‌ఈయూకే) నిర్ణయించాలని చూడడం…
కొరియోగ్రాఫర్స్ మెగాఫోన్ పట్టడం కొత్తకాదు. బాలీవుడ్ తో పాటు సౌతిండియాలో మేల్, ఫిమేల్ కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ అందించారు. చాలా ఆలస్యంగా సీనియర్ కొరియోగ్రాఫర్ బృంద సైతం ఈ బాబితాలో చేరారు. ఆమె దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘హే సినామిక’ గురువారం జనం ముందుకు వచ్చింది. ఆర్యన్ (దుల్కర్ సల్మాన్)కు ఫుడ్ వండటం, గార్డెనింగ్ అంటే ఇష్టం. ఓ భీకర తుఫాను సమయంలో అతనికి మౌనా (అదితీరావ్ హైదరీ)తో పరిచయమవుతుంది.…
దుల్కర్ సల్మాన్ నటించిన ట్విస్టెడ్ టేల్ ఆఫ్ లవ్ “హే సినామిక” ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కొరియోగ్రాఫర్ నుండి దర్శకురాలిగా మారిన బృందా తొలి ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా అనుష్క ఫేవరెట్ స్టార్స్ అంటూ ‘హే సినామిక’ టీంకు విషెస్ అందించింది. “మా అత్యంత ప్రియమైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ప్రియమైన స్నేహితురాలు బృందా మాస్టర్… దర్శకురాలిగా ఆమె మొదటి చిత్రం “హే సినామిక” సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. నా…
చిత్ర పరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. రోజురోజుకు స్టార్లు కరోనా బారిన పడడం ఎక్కువైపోతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా అందరు కరోనా బారిన పడడం భయాందోళనలకు గురిచేస్తోంది. ఇటీవల మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన విషయం విదితమే.. ప్రస్తుత్తం ఆయన ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మమ్ముట్టీ కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ కి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని…
ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో చిన్న సినిమాలు లైన్ కట్టిన సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, బంగార్రాజు తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేమి ఈ సంకాంతి బరిలో లేవనే చెప్పాలి. ఇక ఈ సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అంటూ ఎంటర్ అయిపోయాడు మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక గతేడాది ‘కనులు కనులు దోచాయంటే’ డబ్బింగ్ చిత్రంతోనే దుల్కర్ మంచి కలెక్షన్స్…
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టి ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో…
మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ అనువాద చిత్రాలతో తెలుగువారి ముందుకు వచ్చినా, ‘మహానటి’తో ఇక్కడి ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్నాడు. అంతే కాదు. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నాడు. గత యేడాది అతను నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సైతం చక్కని విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ మూవీ మలయాళంతో పాటు మరో నాలుగు భాషల్లో తొలిసారి శుక్రవారం విడుదలైంది. కేరళకు చెందిన క్రిమినల్ సుకుమార కురుప్.…