దుల్కర్ సల్మాన్ నటించిన ట్విస్టెడ్ టేల్ ఆఫ్ లవ్ “హే సినామిక” ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కొరియోగ్రాఫర్ నుండి దర్శకురాలిగా మారిన బృందా తొలి ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా అనుష్క ఫేవరెట్ స్టార్స్ అంటూ ‘హే సినామిక’ టీంకు విషెస్ అందించింది. “మా అత్యంత ప్రియమైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ప్రియమైన స్నేహితురాలు బృందా మాస్టర్… దర్శకురాలిగా ఆమె మొదటి చిత్రం “హే సినామిక” సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. నా అభిమాన నటులైన దుల్కర్ సల్మాన్, అదితీరావు హైదరీ, కాజల్ అగర్వాల్… ‘హే సినామిక’ ఒక ట్రీట్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. …. ఈరోజు థియేటర్లలో చూడండి” అంటూ చిత్రబృందాన్ని హృదయపూర్వకంగా విష్ చేసింది.
Read Also : Ananya Panday : ఆ హీరోతో రిలేషన్ లో… పేరు బయట పెట్టేసిన ‘లైగర్’ బ్యూటీ
జియో స్టూడియోస్, గ్లోబల్ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో శ్యామ్ ప్రసాద్, నక్షత్ర నగేష్, మిర్చి విజయ్, యోగి బాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా గత కొంత కాలంగా అనుష్క శెట్టి లైమ్‌లైట్‌కి దూరంగా ఉంది. ఆమె చివరగా 2018లో విడుదలైన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘భాగమతి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుష్క నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు దుల్కర్ సల్మాన్ పైప్‌లైన్‌లో రోషన్ ఆండ్రూస్ ‘సెల్యూట్’ మూవీ ఉంది. ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.