Duddilla Sridhar Babu : ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత అగ్నిమాపక శాఖలో డ్రైవర్ అపరేటర్‌లకు మొట్టమొదటి బ్యాచ్‌కు నేడు పాసింగ్ అవుట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విపత్తు స్పందన , అగ్ని మాపక శాఖలో చేరబోతున్న 196 డ్రైవర్ ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు. నాలుగు నెలల పాటు మీ ట్రైనింగ్ ఎలా ఉందో వివరించారని, డ్రైవర్ ఆపరేటర్ల అందరి…
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా మంథని అయ్యప్పస్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయాలలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అయ్యప్ప స్వాములు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆ గ్రామ మహిళ సంఘ అధ్యక్షురాలును శాలువాలతో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్…
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా మంథని లో ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలకు కోటీ ఇరవై లక్షల మంది ఉచిత బస్ టికెట్స్ తో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు.…
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక శివారులో పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఏడాది గడవనే లేదు అంతలోనే అల్లావుద్దీన్ అద్భుతదీపంలా పనిచేయాలని ప్రజల్లో నూరి పోస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని ఆయన అన్నారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఏడుస్తున్నారని, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల…
విమాన ఇంజన్ల కీలక విడిభాగాలు, రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో గణనీయ వృద్ధిని సాధించిన రఘువంశీ ఏరోస్పేస్ భారీ విస్తరణపనులకు శ్రీకారం చుట్టింది. గురువారం నాడు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్ లో ఈ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేసారు. రూ.300 కోట్ల వ్యయంతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో 1200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా శ్రీధర్…
మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేస్తారు.
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి చర్యలకు దిగలేదని, బీఆర్ఎస్ వినకుండా ఉంటే.. మేము న్యాయపరంగా వెళ్లే వారమని, పరిశ్రమలు ప్రగతికి ముఖ్యమన్నా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మీరు పరిశ్రమలు పెట్టినప్పుడు మేము ఇలాగే చేస్తే... అభివృద్ధి జరిగేదా..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, అది దేశంలో ఎక్కడా లేనంత సులభతర వాణిజ్య విధానాల ద్వారా సాధ్యమైందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మలేషియా రాష్ట్రం కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం ద్వారా, మలేషియా పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తాము వారికి ఆహ్వానాన్ని వ్యక్తం చేశారు.
Duddilla Sridhar Babu : గత ప్రభుత్వం పదేళ్లలో 40 వేల ఉద్యోగాలివ్వలేదని విమర్శించారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 50 వేల పై చిలుకు ఉద్యోగాలుచ్చామని ఆయన తెలిపారు. గ్రూప్ 1 పరీక్షకు ముందు విద్యార్థులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో టెక్నికల్ వ్యవస్థలు మూలనపడ్డాయని, ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసారన్నారు.…
మంత్రుల నివాస ప్రాంగణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షలు, జీవో 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, విద్యార్థులు అందరికి న్యాయం జరిగేలా…