Duddilla Sridhar Babu : అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్‌పై ఏడుస్తున్నారు
- గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారు
- ఏడాదిలోనే నిరుద్యోగులకు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది
- మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం :మంత్రి శ్రీధర్‌బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక శివారులో పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఏడాది గడవనే లేదు అంతలోనే అల్లావుద్దీన్ అద్భుతదీపంలా పనిచేయాలని ప్రజల్లో నూరి పోస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని ఆయన అన్నారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఏడుస్తున్నారని, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగులకు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది అని ఆయన వ్యాఖ్యానించారు. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వద్దని బీఆర్ఎస్ నాయకులు సంకల్ప దీక్ష చేపడతారా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, పది నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
YS Jagan : విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది
Also Read
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
అంతేకాకుండా..’మాకు సలహాలు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ పార్టీకి హృదయం ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ నడిపించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. సోనియా గాంధీ ఆలోచనల్లో విద్యా వైద్యం రైతులకు సాగునీరు వంటివి ఇవ్వడమే సోనియా గాంధీ లక్ష్యం. మేము ఇచ్చిన ప్రజా వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాం. గతంలో హరీష్ రావు పత్తిపాకలో పల్లె నిద్ర చేసి రిజర్వాయర్ నిర్మిస్తానని చెప్పి నిర్మించలేక అబద్ధాలు చెప్పాడు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం అయితే ధర్మపురి పెద్దపల్లి నియోజకవర్గంలోని భూములు సస్యశ్యామలం అవుతాయి’ అని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.
Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!