Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా మంథని లో ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలకు కోటీ ఇరవై లక్షల మంది ఉచిత బస్ టికెట్స్ తో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. పది సంవత్సరాల పాటు అధికారం లో అభివృధ్ధి చేయలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడంలో అర్థంలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Minister Nadendla Manohar: నేటితో 1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు..
రైతు బంధు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోకుండా వరి సన్న రకాలకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తున్నామని, రాష్ట్ర ఖజానాకు ఆర్థిక క్రమశిక్షణ తీసుకువచ్చి ఆరు గ్యారంటీ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేసి, మార్పు తీసుకువస్తామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. మంథని లో త్వరలో మహిళలకు ఉపాధి కోసం మహిళా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని, మంథని లో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా.. సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల పని ప్రదేశాల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
CM Revanth Reddy : ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి