Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా మంథని అయ్యప్పస్వామి, దత్తాత్రేయ స్వామి దేవాలయాలలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి అయ్యప్ప స్వాములు శాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు. మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామానికి జాతీయ అవార్డు దక్కడంతో ఆ గ్రామ మహిళ సంఘ అధ్యక్షురాలును శాలువాలతో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశస్థాయిలో మహిళలు గౌరవించే విధంగా మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి ఫ్రెండ్లీ ఉమెన్ కేటగిరిలో అవార్డు దక్కడం గర్వకారణం అని అన్నారు.
Toyota Camry: స్టైలిష్ లుక్, అబ్బురపరిచే ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన టయోటా క్యామ్రీ
గ్రామంలోని మహిళలు ఆర్థిక ప్రణాళికతో మహిళా సంఘాల ద్వారా రుణాలను పొంది వ్యాపారం వాణిజ్యం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నారని కొనియాడారు. గ్రామ మహిళలు వారి కాళ్లపై వారు నిలబడదు నలుగురికి ఉపాధి చూపిస్తూ భారతదేశంలో ఉన్న మహిళలకు గర్వకారణంగా నిలిచారని అన్నారు. గ్రామ పెద్దల సహకారంతో స్వశక్తి సంఘాలను నడుపుతూ ఆర్థిక లావాదేవీలను చేస్తూ మహిళా మణులందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.
Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..