తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా…
పూర్తి స్థాయి బడ్జెట్ మా ప్రభుత్వానికి ఇదే మొదటిది అని శాసన సభ వ్యవహారాల ఇంచార్జీ శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మొదటి సారి ఎన్నికైన ఎంఎల్ఏ లు కూడా చర్చలో పాల్గొన్నారని, రైతులకు లక్షన్నర రుణమాఫీ ఇక్కడి నుండే అమలు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు స్వాగతిస్తూ సభ లో సిఎం ప్రకటన చేశారని, యువత కి ప్రైవేటు రంగంలో నైపుణ్యం పెంచడానికి స్కిల్ యూనివర్సిటీ బిల్లు కు ఆమోదం చేసుకున్నామన్నారు. అదే…
Peddapalli: ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
శుక్రవారం నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు. కూరగాయలతో అలంకారంలో కనకదుర్గమ్మ కనిపించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయం మొత్తాన్ని కూరగాయలతో అలంకరించనున్నారు. వారాంతపు సెలవులు ఉండే సమయం కావడంతో భక్తుల రద్దీకై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేడు ఆషాఢ మాసం…
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ (76) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్న శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో ఉంచారు. ప్రస్తుతం ఆయనను చూసేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివస్తున్నారు.…
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిందని ఆయన అన్నారు. సింగరేణికే గనులు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు కిషన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్త్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపు జరగాలన్నారు. కేంద్ర నిర్ణయం సరికాదు.. రాష్ట్రంలో ఉన్న గనులు… ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలని ఆయన డిమాండ్…
కేవలం విద్య మాత్రమే సమాజాన్ని , దేశాన్ని మారుస్తుంది రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహావిద్యాలయా ఫార్మసీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయి మాట్లాడారు. నాణ్యమైన విద్య తో…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శనివారం సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. సీఎంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన వారిలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్త ఉన్నారు.
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశ్యమని, ధాన్య సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ తరుగు లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని…