విజయనగరం జిల్లాలో మెంటాడ మండలం కుంటినవలస జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ముగడ రామకృష్ణారావు, అదే పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లీషు ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. రామకృష్ణారావు మద్యం సేవించి తరచూ పాఠశాలకు రావడం.. పాఠశాల ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని విద్యా కమిటీ చైర్మన్ పెదిరెడ్ల సత్యనారాయణ డిప్యూటీ డీఈవో మోహనరావుకు ఫిర్యాదు చేశారు.
పూణె ర్యాష్ డ్రైవింగ్ ఘటన దేశాన్ని కుదిపేసింది. మైనర్లు అత్యంత వేగంగా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారు. పోలీసులు ఓ వైపు కఠిన చర్యలు చేపట్టినా.. ర్యాష్ డ్రైవింగ్‌లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బెంగళూరులో కూడా ఇదే తరహాలో ఘటన చోటుచేసుకుంది
పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్‌లోని కటిహార్‌లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.
ఈ మధ్య విమానాల్లో ఎప్పుడూ జరగని వింతలు.. విచిత్రాలు జరుగుతున్నాయి. విమానాల్లో జరిగే సంఘటనలు వార్తల్లో నిలుస్తున్నాయి. విద్యావంతులయుండి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు.
మహబూబూబాద్ జిల్లా హాస్పిటల్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో హల్చల్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. యాక్సిడెంట్ అయిన బాధితులకు వారు కట్లు కట్టుతున్నారు. అంతేకాకుండా వారు ఫేషెట్ల్ ముందే అసభ్యంగా ప్రవర్తించారు. ఫుల్ గా తాగి రూమ్ వార్డులోనే చెత్త డబ్బాలో మూత్రం పోశారు.
పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని డీసీ కాంప్లెక్స్ వెలుపల విధులు నిర్వహిస్తుండగా, మద్యం మత్తులో అభ్యంతరకర చర్యలకు పాల్పడినందుకు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ)ని సస్పెండ్ చేశారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోప్పిగా మారింది. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు మందుబాబులు. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్‌చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టప్రకారం నేరమే అయినా తాగిన మత్తులో డ్రైవ్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చకుంటున్నారు. వారిని ఆపిన పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇటీవలే మలక్పేట్…
ప్రస్తుత సమాజంలో నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. తాగిన మత్తులో కన్నుమిన్ను ఎరుగక అనర్థాలకు పాల్పడుతున్నారు. ఆడమగ అని తేడా లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ గొడవలకు పాల్పడుతున్నారు. అంతేకాదు తెలియని మైకంలో వాళ్లు చేస్తున్న ఆగడాలకు వాళ్లే బలి అవుతున్నారని తెలుసుకునేలోపే అనర్థాలు జరిగిపోతున్నాయి. మద్యం మత్తులో ఓయువతి హైదరాబాద్ లోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హల్ చల్ చేసింది. మద్యం మత్తులో…
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిల్లో ఆల్కాహాల్ ఒకటి. దీని ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తుంది. అయితే, ఆల్కాహాల్ తీసుకున్న తరువాత మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై వైద్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. మగ్గబెట్టిన పండ్లు, ధాన్యం, కూరగాయలతో మద్యాన్ని తయారు చేస్తారు. వీటిని మగ్గబెట్టినపుడు దాని నుంచి ఈస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఈస్ట్ నుంచి అల్కాహాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఈస్ట్ నుంచి ఈథనాల్ కూడా ఉత్పత్తి అవుతుంది. మద్యాన్ని సేవించిన…