ప్రస్తుత సమాజంలో నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. తాగిన మత్తులో కన్నుమిన్ను ఎరుగక అనర్థాలకు పాల్పడుతున్నారు. ఆడమగ అని తేడా లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఎక్కడ పడితే అక్కడ గొడవలకు పాల్పడుతున్నారు. అంతేకాదు తెలియని మైకంలో వాళ్లు చేస్తున్న ఆగడాలకు వాళ్లే బలి అవుతున్నారని తెలుసుకునేలోపే అనర్థాలు జరిగిపోతున్నాయి. మద్యం మత్తులో ఓయువతి హైదరాబాద్ లోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హల్ చల్ చేసింది. మద్యం మత్తులో తన ఒంటిపై బట్టలు తీసి అర్దనగ్నంగా పరుగులు పెట్టింది. పోలీసులకు అక్కడకు చేరుకుని.. ఆ యువతికి బట్టలు వేసి ష్టేషన్ కు తరలించారు.
కాగా.. భువనేశ్వర్ కు చెందిన రష్మిక రౌత్ (ఈవెంట్ డ్యాన్సర్) లక్ష్మికాంత్ ఇద్దరు ప్రేమికులు. ఇండిగో విమానంలో మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చి, శంషాబాద్ లోని డక్కన్ పార్క్ హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసిన రూమ్ లో ఇద్దరు ఫుల్లుగా మద్యం సేవించారు. అనంతరం ఇద్దరి మద్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. గొడవ కాస్త ఎక్కవ కావడంతో ఇద్దరు భయటకు పరుగులు తీశారు. అయితే యువతి వంటిపై బట్టలు తీసేసి రోడ్డుపైకి పరుగులు తీసింది. అర్దనగ్నంగా ఉన్న యువతిని చూసి న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. యువతికి బట్టలు వేయించి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.
యువతులు ఇలా వ్యవహరించడం వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువతి ఇలా అర్థనగ్నంగా రోడ్డుపై పరుగులు పెట్టడం ఏంటిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్లే మరొక యువతులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి వారిని కఠనంగా శిక్షించాలని కోరుతున్నారు.
IND vs SA: అదరగొట్టిన అవేశ్‌ఖాన్.. నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం