Bihar: తాగి ఆలస్యంగా వచ్చిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్‌లోని కటిహార్‌లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.
పెళ్లికి వచ్చిన అతిధుల కోసం అమ్మాయి కుటుంబ సభ్యులు తమ స్టేటస్‌కు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. అయితే వరుడు మంజిత్ చౌదరి కుర్సేలలోని కళ్యాణ మండపంలో పెళ్లి ఊరేగింపుగా రావాలి. వధువు తరుఫు బంధువులు చాలా సేపు ఎదురుచూశారు. రాత్రి అయినా రాలేదు.. కోపంతో ఊగిపోతున్న బంధువులు చుట్టు పక్కల వెతికి చూడగా ఓ కారులో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అయితే ఉదయం పెళ్లి మండపం దగ్గరికి తీసుకొచ్చి చూడగా వరుడు మద్యం మత్తులో ఉన్నాడు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
BJP: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత
తనకు కాబోయే వరుడి పరిస్థితి చూసి వధువు మనీషా పెళ్లికి నిరాకరించింది. మంజిత్ కళ్యాణ మండపానికి వస్తుండగా మద్యం తాగించారని, పెళ్లి ఖర్చుల కోసం ఖర్చు చేసిన రూ.4 లక్షలను తన కుటుంబానికి ఇవ్వాలని వధువు తెలిపింది. డబ్బులు చెల్లించే వరకు మంజిత్‌తో పాటు అతని తల్లిదండ్రులను వదిలిపెట్టేది లేదని పేర్కొంది. దీంతో.. వరుడు తరుఫు బంధువులు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై మంజిత్ చౌదరి మాట్లాడుతూ.. తాను పెళ్లి మండపానికి బయల్దేరే ముందు తన స్నేహితులు కారులోకి ఎక్కి మత్తు కలిగించే పదార్థాలను తినమని చెప్పారని అన్నాడు. వారు ఏమీ ఇచ్చారో నాకు తెలియదు.. కానీ అవి తినగానే మత్తులోకి జారుకున్నట్లు చెప్పాడు. మరోవైపు.. వధువు సోదరుడు మాట్లాడుతూ, మంజిత్ అనారోగ్యంతో ఉన్నట్లు తన కుటుంబ సభ్యులు అబద్ధం చెబుతున్నారని, అతను మద్యానికి బానిస అని అన్నాడు.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!