హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మందు బాబుల వ్యవహారం తల నోప్పిగా మారింది. మందేస్తే చిందే అన్నట్లు.. మందుబాబుల ఆగడాలు నగరంలో మితిమీరుతున్నాయి. మద్యం సేవించి పోలీసులకు సవాల్ విసురుతున్నారు మందుబాబులు. అర్థరాత్రి అయ్యందంటే మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై హల్‌చల్ చేస్తూ.. ప్రజలను, పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టప్రకారం నేరమే అయినా తాగిన మత్తులో డ్రైవ్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చకుంటున్నారు. వారిని ఆపిన పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇటీవలే మలక్పేట్ పోలీసులకు చుక్కలు చూపిన ఓ దివ్యాంగుడు ఘటన మరువక ముందే పాతబస్తీ మీర్ చౌక్ లో మరో మందు బాబు హల్చల్ చేసాడు.
read also: Palle Gosa BJP Bharosa: నేటి నుంచి షూరూ.. వేములవాడలో బండిసంజయ్ బైక్ ర్యాలీ
పాతబస్తీ మీర్ చౌక్ లో పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి టూ వీలర్ నడిపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. మందుబాబు పోలీసులతో వాగ్వివాదానికి దిగాడు. పోలీసుల ఎదుటే ప్యాంట్ విప్పి కొట్టారని నడి రోడ్డు పై హల్చల్ చేసాడు. మందు బాబును నచ్చచెప్పేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించిన ససేమిరా అన్నాడు. చివరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించి వారి కుటుంబం సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. అయితే వారాంతాల్లో ఎక్కువగా కనిపించే మందు బాబులు ఇటీవల వీక్ డేస్ లోనూ రచ్చ చేస్తుండడంతో నగరంలో మందుబాబుల హల్‌చల్ సంచలంగా మారింది.
Govt Jobs: 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీ.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి