ఈ మధ్య విమానాల్లో ఎప్పుడూ జరగని వింతలు.. విచిత్రాలు జరుగుతున్నాయి. విమానాల్లో జరిగే సంఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. విద్యావంతులయుండి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఎంతగా అంటే స్ట్రీట్‌లో కొట్టుకున్నట్టుగానే ప్యాసింజర్లు కొట్టుకుంటున్నారు. అంతేకాకుండా మరికొందరైతే జుగుప్సకరంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఒక మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన సంఘటన కూడా చూశాం. ఇక తాజాగా ఓ విమానంలో మందుబాబు రెచ్చిపోయాడు. తోటి ప్రయాణికులు, సిబ్బందిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో ప్రయాణికులు డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌లాగానే కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Kavya Kalyan Ram : బలగం బ్యూటీ కొత్త స్టిల్స్ అదుర్స్..
ఈజీ జెట్ విమానంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద అరుపులు, కేకలతో చిన్నారుల నుంచి మహిళలంతా భయాందోళనకు గురయ్యారు. ఈజీ జెట్ విమానం టర్కీలో ల్యాండ్ అయిన అనంతరం మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానం పైకప్పును బాదుతూ మరో వ్యక్తితో వాదనకు దిగాడు. అతడిని వారించడానికి చూసిన టర్కీ పోలీసు అధికారి, మహిళా ఎయిర్‌లైన్ ఉద్యోగిపైనా దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామంతో ఇతర ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం అధికారులు అతడిని విమానం నుంచి బయటకు పంపించేశారు.
ఇది కూడా చదవండి: America Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి
ఎడిన్‌బర్గ్‌లో విమానం బయలుదేరినప్పటినుంచి మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్కాటిష్ ఫుట్‌బాల్ జట్ల మధ్య జరుగుతున్న పోటీని చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో అతడి ప్రవర్తనపై పక్కనున్న మరో వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నిందితుడు తోటి ప్రయాణికుడిపైనా, విమాన సిబ్బందిపైనా దాడి చేశాడు.
ఈ ఘటనపై ఈజీజెట్ అధికారులు స్పందిస్తూ.. ప్రయాణికుడు విమానంలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వివిధ మనస్తత్వాలు గల ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలి.. తగిన చర్యలు ఎలా తీసుకోవాలనే విషయంలో తమ సిబ్బంది శిక్షణ పొందినట్లు వెల్లడించారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు సంస్థ అధిక ప్రాధాన్యమిస్తుందని.. ఇలాంటి సంఘటనలను ఎప్పటికీ సహించమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విమానంలో జరిగిన ఫైటింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫైటింగ్‌ను మీరు కూడా చూసేయండి.
A fight broke out on an #easyJet flight from #Edinburgh to #Antalya, on April 20. When the aircraft landed at Antalya Airport, police were called on board.The passenger hit another passenger, and then he hit the police officer too.
🎥©Scott Johnston via @HavaSosyalMedya#Turkey pic.twitter.com/WDyR5SN0ue
— FlightMode (@FlightModeblog) April 22, 2024