ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మరోసారి డ్రోన్లు కలకలం సృష్టించాయి.. ఇప్పటికే పలు దపాలుగా ఆయల పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతుండగా.. మళ్లీ ఎగిరాయి డ్రోన్లు.. ఇక, డ్రోన్లను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.. అయితే, శ్రీశైలంలో గత నాలుగు రోజులుగా అర్ధరాత్రి సమయంలో డ్రోన్లు సంచరిస్తున్నాయి.. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్నాయి.. వీటిని పట్టుకోవడానికి పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు.. అయినప్పటికీ ఒక్క డ్రోన్ కూడా వారికి దొరకలేదు.. దీంతో.. శ్రీశైలం చుట్టూ ఉన్న నల్లమల ఫారెస్ట్‌లో పోలీసు బృందాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి.