గత కొన్ని రోజులుగా పాక్ భూభాగం నుంచి డ్రోన్‌లు రహస్యంగా భారత్ భూభాగంలోకి వచ్చి ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసందే. జమ్మూకాశ్మీర్‌లోని వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి తరువాత, భారత బలగాలు అప్రమత్తం అయ్యాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. అయినప్పటికీ నిత్యం జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోనులు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో ఈ డ్రోన్‌లకు చెక్ పెట్టేందుకు డీఆర్‌డీఓ రంగంలోకి దిగింది.
Read: మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?
లేజర్ టెక్నాలజీ ఆధారంగా యాంటి డ్రోన్ గన్స్‌ను తయారు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఈ యాంటీడ్రోన్ గన్స్ ను మోహరించబోతున్నారు. ప్రతి 15 నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఒక యాంటిడ్రోన్ గన్ ను మోహరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ యాంటిడ్రోన్ గన్ డ్రోన్‌లను మూడు కిలోమీటర్ల అవతల నుంచే కనిపెట్టి డ్రోన్‌ను పనిచేయకుండా చేస్తుంది. 1. 5 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చిన డ్రోన్‌ను లేజర్ సహాయంతో పేల్చివేస్తుంది.