దేశంలో డ్రోన్ల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే రక్షణ, ఆరోగ్యం, ఆహారం వంటి రంగాలలో డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో దీనికోసం కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలు ప్రణాళికలు తయారు చేసింది. విమానాల నియంత్రణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఉన్నది. అయితే, డ్రోన్‌లను మానవ రహిత విమానాలుగా పిలవాల్సి ఉంటుంది కాబట్టి వీటికోసం ప్రత్యేక ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం ను రూపొందించింది. అన్‌మ్యాన్డ్ ఎయిర్ క్రాప్ట్ సిస్టం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌ను తీసుకొచ్చింది. ఇది ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ యూటీఎం ద్వారా డ్రోన్ ప్లైయింగ్ ప్లానింగ్, దూరం, వాతారవణ సమాచారం, విమానాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుంటారు. అలానే, కేంద్రం తీసుకురాబోతున్న డిజిటల్ స్కై ద్వారా ప్రతి డ్రోన్‌కు సంబందించిన తమాచారాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రోన్ వ్యవస్థలను నియత్రించే వ్యవస్థలకు మొదట కొంత పరిధి వరకు మాత్రమే అనుమతులు ఉంటాయి. ఆ తరువాత వాటి వినియోగాన్ని అనుసరించి పరిధి పెంచే అవకాశం ఉంటుంది. ఎలాంటి డ్రోన్ లు అయినప్పటికీ 1000 అడుగుల ఎత్తుకు మించి ఎగిరేందుకు అనుమతులు లేవని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలియజేసింది.
Read: విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు: దానికోసమే బాబు ఢిల్లీ వచ్చారు…