బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన నటి రన్యారావు ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ వేసింది. ఈ సందర్భంగా మంగళవారం రన్యారావు తరపున న్యాయవాది కిరణ్ జవాలి వాదనలు వినిపించారు. మార్చి 3న అరెస్టైన దగ్గర నుంచి రన్యారావును డీఆర్ఐ అధికారులు మానసికంగా వేధించారని.. ఆమెకు నిద్రలేకుండా చేశారని తెలిపారు. నిద్రపోయే హక్కును అధికారులు హరించారని న్యాయస్థానానికి రన్యారావు తరపు న్యాయవాది తెలిపారు. ఒక మహిళకు నిద్రపోయే హక్కు లేదా? అని కోర్టుకు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Rapido: స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో ఎంట్రీ!
ఇటీవల రన్యారావుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. ఆ ఫొటోలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లుగా కనిపించాయి. కంటి కింద నల్లటి మచ్చలు.. ముఖం ఉబ్బినట్టుగా కనిపించింది. దీంతో ఆమెపై డీఆర్ఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా మహిళా సంఘాలు కూడా ధ్వజమెత్తాయి. ఒక మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమేంటి? అని నిలదీశాయి. ఆమె కోరుకుంటే సహాయం చేస్తామని తెలిపాయి.
ఇది కూడా చదవండి: Jio OTT Plans: ఒక్క రీఛార్జ్ తో 12 OTT యాప్స్ కు ఫ్రీ యాక్సెస్.. OTT లవర్స్ ఓ లుక్కేయండి
ఇదిలా ఉంటే సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. తనను మానసికంగా వేధించారని.. నిద్రలేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తనను మాత్రం కొట్టలేదు గానీ.. మాటలతో హింసించిం.. బెదిరించినట్లు ఆమె వాపోయింది. అయితే ఈ విషయాన్ని కోర్టుకు ఎందుకు తెలియజేయలేదని న్యాయమూర్తి అడిగారు. ఈ సందర్భంగా వైద్య సదుపాయం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా బెయిల్ పిటిషన్ సందర్భంగా మరోసారి ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశాడు.
ఇది కూడా చదవండి: Rohit Sharma: 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్ శర్మ ఆడాలి.. ఆస్ట్రేలియా దిగ్గజం కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కేసును సీబీఐ తన చేతుల్లోకి తీసుకుంది. స్మగ్లింగ్ వెనుక ఎవరున్నది తేల్చే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఉంది. ఆమెకు మూడు నెలల క్రితమే ఆర్కిటెక్ జతిన్ హుక్కేరితో వివాహమైంది. అయితే అతడితో ఎప్పుడూ సంసారం చేయలేనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాకుండా ఖరీదైన బహుమతులు ఇచ్చారు. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన వీడియోను పరిశీలిస్తున్నారు. ఎవరెవరు హాజరయ్యారు. ఖరీదైన గిఫ్ట్‌లు ఎవరిచ్చారన్నది కనిపెడుతున్నారు. ఇక తాజాగా రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్ సమయంలో ఎక్కువగా ఇతడితోనే సంభాషించినట్లుగా కాల్ డేటాలో కనుగొన్నారు.
మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బంగారం స్మగ్లింగ్ చేస్తూ రన్యారావు పట్టుబడింది. ఆమె దగ్గర నుంచి రూ.12 కోట్లకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆమె ఇంటి దగ్గర కూడా రూ.3కోట్ల ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈమె వెనుక రాజకీయ శక్తులు ఉన్నట్లుగా డీఆర్ఐ అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక రన్యారావు తండ్రి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఈ పలుకుబడి ఉపయోగించుకుని రన్యారావు.. వీఐపీ ప్రొటోకాల్‌లో బయటకు వచ్చేసినట్లుగా గుర్తించారు. ఇక దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Yuzvendra Chahal: ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి చూడండి.. చాహల్ సంచలన పోస్టు