బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోలో ఆమెపై గాయాలు ఉన్నట్లుగా కనిపించాయి. దీంతో ఆమెపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించారంటూ మహిళా సంఘాలు ఆరోపించాయి. ఇక ఆమెను జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు భోరున విలపించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆమెపై గాయాలు కావడంపై తీవ్ర దుమారం రేపుతోంది.
బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావుకు చెందిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె డీఆర్‌ఐ కస్టడీలో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఆమె దగ్గర నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్‌ను డిఆర్‌ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్‌లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు.
తమిళనాడులో శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు సీజ్ చేశారు. మండపం తీరంలో ఓ కంట్రీ బోటు నుంచి అక్రమంగా తరలిస్తున్న 99 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ అధికారి వెల్లడించారు. డ్రగ్స్ తో వెళ్తున్న పడవ శ్రీలంక వైపు వెళుతుండగా.. పక్కా సమాచారంతో అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు.
Cocaine : డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMI) నుండి కొకైన్‌తో కెన్యా మూలానికి చెందిన మహిళను పట్టుకుంది.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జాయింట్ ఆపరేషన్‌లో 15 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) ఆదివారం తెలిపింది.
గోవా విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు DRI అధికారులు. 12 కోట్ల విలువ చేసే 5.2 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు. ఓ ప్రయాణికురాలు ఇథియోపియా నుండి హెరాయిన్ తీసుకొస్తుండగా గోవాలో పట్టుకున్నారు.
ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10.16 కోట్ల రూపాయల విలువైన 16.36 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు.
డ్రగ్స్ మాఫియాపై చెక్ పెడుతున్నారు అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్ సరఫరాకు డ్రగ్ డీలర్స్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న సందర్భంలో అధికారులు అలర్ట్ అయ్యారు. నగర శివారు ప్రాంతాల్లో డంప్ చేసి డ్రగ్ మాఫియా పెట్టుకుంటున్నారు.